Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Showing posts with label Nishanth Health Tips. Show all posts
Showing posts with label Nishanth Health Tips. Show all posts

Friday, 5 September 2014

PRECAUTIONS TO BE TAKEN BY SUGAR PATIENTS - TIPS FOR SUGAR CARE


Cinnamon Nutrition Facts - DALCHINA CHEKKA USES


వృద్ధాప్యాన్ని దూరం చేసే దాల్చిన చెక్క

వంటకాల్లో వాడే మసాలాల్లో లవంగాలతో పాటు దాల్చిన చెక్క కూడా తప్పనిసరి. చూడడానికి చెట్టుబెరడులాగాకన్పించే దాల్చిన చెక్క వంటకాలకు మంచి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తరచూ వాడుతుంటే వృద్ధాప్యపు ఛాయలు త్వరగా దరి చేరవంటారు ఆయుర్వేద నిపుణులు. దాల్చిన చెక్క శరీరంలోని కణజాలానికి జవసత్వాలను అందిస్తుంది. అందువల్లనే దాల్చిన చెక్కను ప్రతి నిత్యం వాడడం వల్ల ఆ కణజాలాలు నిత్య యవ్వనంగా ఉంటాయట. చక్కెర వ్యాధితో బాధపడే వారు సైతం ఈ దాల్చిన చెక్కను నిత్యం వాడుతూ ఉంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. దాల్చిన చెక్కను పొడి చేసి పాలలో చక్కెరకు బదులు ఈ పొడిని ఓ చెంచా వేసుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు.

Tuesday, 22 July 2014

TELUGU HEALTH TIPS - INGUVA ADVANTAGES IN DAILY LIFE - INGUVA HEALTH TIPS IN TELUGU


ఇంగువ ఔషధ విలువలు

* ఇంగువ చాలా మందికి వంటల్లో వాడుకునే పదార్థాంగానే తెలుసు. అయితే దీనిలో ఔషధ విలువలు అనేకం ఉన్నాయి.

* దీనికి ఫెరులా ఫోటిడా అనే ల్యాటిన్ పేరు ఉంది. ఫోటిడా అంటే తీవ్రమైన వాసన కలిగినది అని అర్థం. మన దేశంలో కాశ్మీర్‌లో లభించే ఇంగువ పేరు ఫెరులా నార్తెక్స్. దీనిని ఇంగ్లీషులో ఆసాఫోటిడా అనీ, డెవిల్స్ డంగ్ అనీ అంటారు. సంస్కృతంలో హింగు అని పేరు.

* ఇంగువలో సల్ఫర్ యోగికాలు ఉంటాయి కనుక గాఢమైన వాసన వస్తుంటుంది. దీని వాసనలోని గాఢత ఉల్లిపాయ వాసనని మించి ఉంటుంది. దీనిని ఆహార పదార్థాల తయారీకి వాడుతుంటారు. అలాగే మసాలాల తయారీలో కూడా ఇది ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.

* కాంథార్, ఆఫ్గనిస్తాన్, పర్షియా, ఇరాన్ వంటి దేశాలు దీనిని విశేష స్థాయిలో ఉత్పత్తిచేస్తాయి. అరేబియన్ వైద్యులు దీనికి విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. మన దేశం విషయానికి వస్తే... కాశ్మీర్ ప్రాంతంలో ఇంగువ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి.

* ఇంగువను ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు. చెట్టునుంచి సేకరించిన బంక లాంటి నిర్యాసానికి (ఓలియో గమ్ రెసిన్) ఔషధపు విలువుంటాయి. చెట్టు మిగతా భాగాల్లో అంతగా ఔషధపు విలువలు ఉండవు.

ఔషధోపయోగాలకోసం సాధారణంగా ఇంగువను 125-500 మి.గ్రా. మోతాదులో వాడతారు.

* ఇంగువను నేరుగా కాకుండా శుద్ధిచేసి వాడుకుంటే దానిలోని ఉగ్రత్వం తగ్గుతుంది. ఇనుప మూకుడులో నెయ్యి వేసి నిప్పుల మీద వేడి చేయాలి. తరువాత దీనిలో ఇంగువను వేసి దోరగా వేయించాలి. చల్లారిన తరువాత ఔషధ కల్పనకు ఉపయోగించాలి.

* హింగ్వాష్టక, హింగుత్రిగుణ తైలం, రజఃప్రవర్తవీవటి వంటి ఔషధాలు ఇంగువ ప్రధాన ద్రవ్యంగా తయారవుతాయి.

* ఇంగువను సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంగువ చెట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. దీనికి క్యారెట్ ఆకారాన్ని పోలిన వేర్లు ఉంటాయి. వేరు పైభాగంలో కత్తితో గాటుపెట్టి వదిలేస్తే నెమ్మదిగా నిర్యాసం సంచితమవుతుంది. ఇది గట్టిపడి పసుపుపచ్చని రంగు జిగురుగా మారుతుంది. దీనినే ‘ఇంగువ’ అంటారు. ఇలా సేకరించిన దానిని మట్టి మూకుడులోకి తీసుకొని తోలు సంచిలో ప్యాక్‌చేసి మార్కెట్‌కి తరలిస్తారు.

* ఇంగువ చాలా ఖరీదైనది కనుక సాధారణంగా కల్తీ కలుపుతుంటారు. తుమ్మజిగురు, బంగాళా దుంప ముక్కలు, ఇంగువ పట్ట కషాయంతో కలిపి ముద్దచేసి ఇంగువగా చెలామణి చేస్తుంటారు కనుక జాగ్రత్త పడాలి.

* అసలైన ఇంగువను గుర్తించడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఉదాహరణకు అసలు సిసలైన ఇంగువను నీళ్లలో వేస్తే పూర్తిగా కరుగుతుంది. ఇంగువ కలిపిన నీళ్లన్నీ పాల మాదిరిగా తెల్లగా తయారవుతాయి. ఇంగువకు అగ్గిపుల్లతో గీసి మండిస్తే పూర్తిగా మండిపోతుంది.

* బ్రిటీష్ హెర్బల్ ఫార్మకోపియా, ప్రపంచ ఆరోగ్యసంస్థ విడుదల చేసిన మోనోగ్రాఫ్ ఫర్ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ వంటివి ఇంగువ ఔషధోపయోగాలను ప్రచురించాయి.

దీర్ఘకాలపు బ్రాంకైటిస్, ఉబ్బసం, కోరింత దగ్గు, గొంతు బొంగురు, హిస్టీరియా, ఫ్లాస్టులెంట్ కోలిక్, (గ్యాస్‌తో కూడిన ఉదరశూల), మూర్ఛలు, ఆంత్రక్రిమి, డిస్పెస్పియా, క్రానిక్ గ్యాస్టైటిస్, ఇరిటబుల్ కోలాన్ తదితర వ్యాధుల్లో ఇంగువ ఉపయోగపడుతుంది. బాహ్యంగా ఇంగువను ఆనెలు, చర్మకీలల్లో ప్రయోగించవచ్చునని ఈ మోనోగ్రాఫ్స్ సూచించాయి. కాగా ఇంగువను వాడకూడని సందర్భాలు సైతం ఉన్నాయి. శరీరాంతర్గత రక్తస్రావాలు, గర్భధారణ సమయంలో వాడకూడదు (అబార్షన్ రిస్కు ఉంటుంది), స్తన్యపాన సమయంలో తల్లి వాడకూడదు. పసిపిల్లల్లో వాడకూడదు (మెథిమో గ్లోబినీమియా రిస్కు ఉంటుంది). యాంటి కోగులెంట్స్, త్రాంబోలైటిక్స్ వాడుతున్నప్పుడు ఇంగువను వాడకూడదు (రక్తస్రావం రిస్కు పెరుగుతుంది). రక్తస్రావ వ్యాధుల్లో ఇంగువను వాడకూడదు. పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ కారణంగా శోథ జనించినప్పుడు ఇంగువను వాడకూడదు. రక్త్భారం ఎక్కువ తక్కువల్లో ఇంగువను వైద్య సలహా లేకుండా వాడకూడదు.

ఆయుర్వేద గృహ చికిత్సలు

పిప్పి పన్ను

ఇంగువను కొద్దిగా వేయించి పిప్పి పన్ను మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది.
బహిష్టు నొప్పి (మక్కలశూల)
ఇంగువను నేతిలో వేయించి తీసుకుంటే బహిష్టు నొప్పి తగ్గుతుంది.

మలేరియా జ్వరం

ఇంగువకు పాత నెయ్యి కలిపి గాఢంగా వాసన చూస్తే మలేరియాలో ఉపశమనం లభిస్తుంది.

ఇంగువకు సౌవర్చల లవణం కలిపి తీసుకుంటే కడుపునొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి కషాయానికి ఆముదం వేర్లు, బార్లి, పుష్కర మూలం, ఇంగువ కలిపి తీసుకున్న కడుపునొప్పి తగ్గుతుంది.
ఆకలి తగ్గటం (అగ్నిమాంద్యం)
ఇంగువ, త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, సైంధవ లవణం ఈ ఎనిమిదింటినీ సమానంగా తీసుకొని పొడిచేసి వేడి నీళ్లతో తీసుకోవాలి. దీనిని హింగ్వాష్టక చూర్ణం అంటారు.

ఉన్మాదం

నెయ్యిలో ఇంగువ, ఇంగువ ఆకులు, కరక్కాయ, బ్రాహ్మీలను వేసి వేడిచేసి తీసుకోవాలి.

మద్యపానంలో మత్తు దిగడానికి
సౌవర్చల లవణానికి ఇంగువ, మిరియాలు కలిపి పుల్లని మజ్జిగతో తీసుకుంటే మద్యపానం తరువాత వచ్చే మత్తు దిగుతుంది.

చెవి నొప్పి

ఆవ నూనెకు ఇంగువ, శొంఠి కలిపి వేడిచేసి చెవిలో వేసుకుంటే చెవి నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. లేదా హింగ్వాది తైలాన్ని కూడా వాడవచ్చు.
ఉదరంలో పెరుగుదలలు (గుల్మం)
హింగ్వాది చూర్ణం, హింగ్వాది గుటిక, హింగుత్రిగుణ తైలం వంటివి వాడాలి.

జీర్ణ వ్యవస్థ వ్యాధులు

గ్యాస్‌ని వెలువరింపచేసే తత్వం ఇంగువకు ఉంటుంది. గ్యాస్ నుంచి ఉపశమనాన్ని కలిగించే ఓషధుల్లో ఇది ముఖ్యమైన ఓషధి. ఆహారం జీర్ణం కాకపోవటం, కడుపునొప్పి వంటి సమస్యల్లో ఇంగువను ఉపయోగించవచ్చు. పొట్ట ఉబ్బరించి గ్యాస్‌తో నిండిపోయినప్పుడు ఇంగువను బాహ్య ప్రయోగంగా వాడి ప్రయోజనం పొందవచ్చు. ముందుగా ఇంగువను వేడినీళ్లలో కరిగించాలి. ఒక గుడ్డను ఈ నీళ్లలో తడిపి ఉదర కండరాలపై పరిచి కాపడం పెట్టుకోవాలి. గ్యాస్ మరీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే ఇంగువ కలిపిన నీళ్లను ఎనిమా మాదిరిగా తీసుకోవచ్చు.

- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

COLD AND FEVER - MAY BE MALARIA FEVER - TAKE CARE OF KIDS


WHY NO HEAVY WEIGHT ?


SONTI USED FOR GOOD DIGETION - TELUGU DIGETION TIPS


SLEEPING HEALTH TIPS IN TELUGU


TELUGU TIPS IN USING MULAKAYA VEGETABLE


'మునగ' 

మునగాకులో పోషక విలువలు పుష్కలం. మునగ ఆకు, కాయల్లో ఔషధగుణాలు ఉండటం వల్ల పాతకాలంలో మూలికావైద్యంలోనూ వాడేవారు. విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ప్రొటీన్లు దండిగా ఉండే మునగకాయల్ని రకరకాల కూరల్లో కలుపుకుని కూడా వండుకోవచ్చు. సాంబారు, వేపుళ్లు సరేసరి. మునగ మధుమేహులకు ఉపకరిస్తుంది. మానసిక ఆందోళన, తలనొప్పి, ఊపిరితిత్తుల జబ్బుల్ని తగ్గించే శక్తి దీనికుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమతుల్యపరచడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడుకొవ్వును తొలగించగలదు మునగ.

KAKARAKAYA - BITTERGOURD - HEALTH TIPS IN TELUGU - CANCER PROTECOR


కాకరతో కేన్సర్‌కు అడ్డుకట్ట

భారతీయ వంటకాలలో ఇకపై కాకర కాయకు మరింత ప్రాధాన్యం లభించనుంది! తల, మెడలోని కేన్సర్ కణాల ఎదుగుదలను నిరోధించే లక్షణాలు ఈ కూరగాయలో ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడి కావడమే దీనికి కారణం. జంతువులపై చేసిన ప్రయోగంలో తల, మెడలలో సంభవించే కేన్సర్ కణాల ఎదుగుదలను అణిచి, కణితి పెరగుదలను కాకర తగ్గిస్తుందని కనుగొన్నామని భారతీయ సంతతికి చెందిన పరిశోధకురాలు రత్న రే తెలిపారు. కాకర ప్రభావం కచ్చితంగా ఇంత ఉంటుందని తేల్చి చెప్పలేకున్నా, చికిత్సలో మందులతో పాటు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

USES AND ADVANTAGES OF USING COCONUT OIL - COCONUT OIL HEALTH TIPS IN TELUGU


chitika