Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Tuesday, 28 April 2015

SUMMER HEALTH TIPS IN TELUGU - INSTANT HEALTH AND ENERGY WITH VEGETABLES AND FRUITS


వేసవిలో తక్షణశక్తి కోసం

ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తీసుకోవడానికి మించిన మార్గం మరొకటి లేదు. నీరసంగా ఉన్నప్పుడు తక్షణ శక్తికోసం పండ్లు బాగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా వేసవిలో పండ్లు అధికంగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

బెర్రీస్‌: బ్లూబెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌, రాస్ప్‌బెర్రీస్‌, బ్లాక్‌బెర్రీస్‌, గూస్‌బెర్రీస్‌ అని రకరకాల బెర్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలోయాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్‌, తగినంత ఫైబర్‌ లభిస్తుంది. రోజూ అరకప్పు నుంచి ఒక కప్పు బె ర్రీస్‌ తీసుకోవాలి. గ్రిల్డ్‌ మీట్‌, సలాడ్స్‌తో కలిపి కూడా బెర్రీస్‌ తినొచ్చు.

చెర్రీస్‌: బెర్రీస్‌లో మాదిరిగానే వీటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో న్యాచురల్‌ షుగర్‌ కంటెంట్‌ పాలు కాస్త ఎక్కువే ఉంటుంది.

యాపిల్స్‌, పియర్స్‌ : వీటిలో షుగర్‌ శాతం తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గ్రేప్స్‌: సిట్రస్‌ పండ్లలో షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. కానీ గ్రేప్స్‌లో ఉండదు. వీటిని సలాడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు. అవొకడ్‌ ముక్కలతో కలిపి తీసుకుంటే మరింత ఆస్వాదించవచ్చు.

అప్రికాట్స్‌: యాపిల్స్‌, పియర్స్‌లో మాదిరిగానే ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్‌ సి, ఫైబర్‌ అధికంగా లభిస్తుంది.

అరటిపండ్లు: ఏడాది పొడవునా లభిస్తాయి. వీటిని ఎనర్జీ పవర్‌ హౌజ్‌లుగా చెప్పుకోవచ్చు.

మామిడి పండ్లు: వేసవిలో ముందుగా ఇష్టపడేది మామిడిపండ్లనే. ఈ సీజన్‌లోనే మామిడి పండ్లు లభిస్తాయి. నేరుగా తినే కన్నా జ్యూస్‌ రూపంలో తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు సమకూరుతాయి.

No comments:

Post a Comment

chitika