మోక్షకారకం... శ్రీముఖలింగం
దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రల్లో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖ లింగం పుణ్యక్షేత్రం ఒకటి. దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఈ క్షేత్రం శాసనాల్లో లిఖించబడింది. ఎంతో చరిత్ర కలది. మానవ జన్మకి మోక్షం కలగాలంటే శ్రీముఖలింగం దర్శించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అద్భుత నిర్మాణాలు, అపురూప శిల్ప సంపద కలదు.
వంశధార నదీ తీరాన గల శ్రీముఖ లింగంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరనితోపాటు భీమునిచే ప్రతిష్టించబడిన భీమేశ్వర ఆలయం, చంద్రునిచే ప్రతిష్ఠించబడిన సోమేశ్వర ఆలయాలు ఉన్నాయ. దేశంలో ఏ ఆలయాలలో చూసినా శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తాడు. దీనికి భిన్నంగా శ్రీముఖ లింగంలో ముఖాకారంలో దర్శనం ఇవ్వడం గొప్ప విశేషం.
ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏక రాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమైవున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోను, శ్రీముఖ లింగంలోను తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు.
ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏక రాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమైవున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోను, శ్రీముఖ లింగంలోను తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు.
శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తర ముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చుని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖ లింగంలో అష్టగణపతులున్నారు.
వ్యాసమహర్షి భారతముతోపాటు పంచమవేద గ్రంథాలు వ్రాయుటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్టించి ప్రారంభించినట్టు దీనితోపాటు శక్తిగణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి(నాట్య), సిద్ధి గణపతులు దర్శనం ఇస్తారు. ఇక్కడ కోటి లింగాలకు ఒకటి తక్కువ అని చరిత్ర చెబుతుంది.
6, 4, 8వ శతాబ్దాల నాటి ఆలయాలుశ్రీముఖ లింగంలో ఆలయాలు 6,4,8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్టు శాసనాల్లో ఉన్నాయి. ఆరవ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, నాలుగో శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, ఎనిమిదో శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండువందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గజపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటినుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతోంది.
మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికీ మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు.
* స్వప్నేశ్వర లింగం
ఇటీవలి కాలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది. శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
* విప్ప(మధు)చెట్టు
ప్రధాన దేవాలయంలో ముఖాకారంగా దర్శనం ఇస్తుంది. దీనిని మధుకేశ్వర స్వామిగా పిలుస్తారు. శతాబ్దాల క్రితం కీకారణ్యంగా వుండే ఈ ప్రాంతంలో విప్ప (మధు) చెట్టును చిత్రసేనుడు అను కోయరాజు శివుడిని స్మరించి పూజించేవాడు. ఆయనకి చిత్తి, చిక్కల అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. సవతుల పోరు భరించలేక ఒకరోజు చిత్రసేనుడు మధువృక్షమును గొడ్డలితో నరికివేయడంతో అగ్నిజ్వాలలు లేచి అందునుండి శివుడు ముఖ దర్శనం ఇచ్చినట్టు చరిత్ర తెలియజేస్తోంది.
ఇంతటి చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు అలసత్వం చూపుతున్నారని భక్తులనుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
* జాతరలు
మహాశివరాత్రి మూడురోజుల జాతర మహాశివరాత్రి మొదలుకుని నాలుగో రోజు చక్రతీర్ధ స్నానముతో ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినముతోపాటు ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగు సోమవారాలు, మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు. పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తించినా కనీస వౌలిక సదుపాయాలు లేకపోవడం శోచనీయం. ఇంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment