లేపాక్షీ-శిల్పకళా నైపుణ్యానికి మెచ్చుతునక వేళ్ళాడే స్థంభం
(wonders in Indian Temples)
లేపాక్షీ దేవాలయ నిర్మాణం శ్రీ కృష్ణదేవరాయల వంశానికి చెందిన సాళువ నరసింహరాయల కాలంలో విరూపాక్షుని ఆధ్వర్యంలో జరిగింది... ఇది ఎన్నో అద్భుతాలకు నిలయం..
ఇప్పుడు మీరు చూస్తున్న మూడు చిత్రాలలో మొదటిది.. వేళ్ళాడే స్థంభం పూర్తి రూపం... అంటే ఈ స్థంభం కేవలం పై కప్పు ఆధారంగా చేసుకుని వేళ్ళాడుతూ ఉంటుంది... క్రింద నేల నుండి ఒక సెంటీమీటరు ఖాళీ (మూడవచిత్రాన్ని చూడండి)ఉంటుంది... ఆ ఖాళీ నుండి మన చీర కొంగును ఇవతల నుండి అవతలకు(రెండవ చిత్రంలో చూపినవిధంగా) చాలా సులభంగా దూర్చవచ్చన్న మాట...
అయితే మన హిందూ దేవాలయాలను పూర్తిగా కొల్లగొట్టాలని వచ్చిన కొంత మంది తురుష్కులు ఈ స్థంభాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారట... అయితే వారి ప్రయత్నంలో ఆలయం క్రుంగటం కనపడిందట.. ఒకవేళ ఆ స్థంభాన్ని తొలగించినట్లయితే పూర్తిగా ఆలయం నేలమట్టమవుతుంది.. ఆ ప్రయత్నం లో అంతా సమాధి అవుతారని భయపడి వెనక్కు తగ్గారట... ఎందుకంటే ఆలయ పూర్తి భారం(గరిమనాభి) ఈ స్థంభం దగ్గర వచ్చే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.. ఎంతటి నిర్మాణ కౌశలత్వం(ఇంజనీరింగ్ ఎఫిసియెన్సీ) అంతటి కౌశల్యాన్ని చూసిన తురుష్కులకు నోట మాట రాలేదట.. చివరికి ఏమీ చేయలేక కనపడిన విగ్రహాన్నెల్లా ధ్వంసం చేసారు కానీ.. ఈ స్థంభాన్ని మాత్రం ఏం చేయలేకపోయారు...
వీలుంటే లేపాక్షీ ఆలయాన్ని దర్శించండి... ఇది అనంతపురం జిల్లా...హిందుపురానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది..
No comments:
Post a Comment