స్పాంజ్ ఇంట్లో ఉంటే
చాలా మందికి స్పాంజ్‌ను ఏవిధంగా ఉపయోగించాలో తెలియదు. ముఖ్యంగా ఇది చౌకైనది కూడా. దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చుచేయాల్సిన పని కూడా లేదు. అందుకే ఇంట్లో స్పాంజ్‌ను స్టాక్ పెట్టుకోవాలి. స్పాంజ్ ఎలాంటి ద్రవానైనా చాలా సులభంగా గ్రహిస్తుంది. మన ఇళ్ళల్లో తడిగా ఉన్న ఫ్లోర్‌ను శుభ్రం చేయడం ద్వారా తడిని త్వరగా డ్రై అయ్యేలా చేయవచ్చు. అంతే కాదు, స్పాంజ్ వల్ల మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం...
బట్టలను శుభ్రం చేస్తుంది: దుస్తులు, స్వెటర్ల మీద చిన్న మరకలు పడినప్పుడు, దాన్ని చాలా సింపుల్‌గా శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల దుస్తుల మీద ఏర్పడ్డ మరకలు, పూతలు నివారిస్తుంది.
ప్లాంట్ కంటైనర్‌లో ఉపయోగించాలి: మొక్కలు పెట్టిన కుండీల కింద స్పాంజ్ ఉంచడం వల్ల మొక్కలకు పోసే నీరు కుండీల నుంచి లీక్ అయినప్పుడు, స్పాంజ్ ఆ నీటిని పీల్చుకొంటుంది. దాంతో ఫ్లోర్ మీద మట్టి మరకలు పడకుండా సహాయపడుతుంది. అంతే కాదు, స్పాంజ్‌లోని నీరు మొక్కను ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది.
మీ కార్పెట్‌ను శుభ్రం చేస్తుంది: మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లైతే కార్పెట్ మీద పెంపుడు కుక్కల యొక్క జుట్టు పడినప్పుడు, స్పాంజ్‌తో తుడిస్తే చాలా సులభంగా తొలగిస్తుంది.
గ్లాస్ వేర్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది: ఇంట్లో ఏవైనా గాజు వస్తువులు పగిలినప్పుడు వాటిని తొలగించడానికి స్పాంజ్ చాలా ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది. అలాగే గాజు వస్తువులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మార్చాలనుకున్నప్పుడు స్పాంజ్ ఒక కుషన్‌లాగా పనిచేస్తుంది. వస్తువులు పగిలిపోకుండా కాపాడుతుంది.
డిష్‌వాష్: వంటగదిలోని పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఎటువంటి గీతలు పడకుండా శుభ్రం చేస్తుంది. డైనింగ్ టేబుల్, ఇతర టేబుల్స్ కూడా శుభ్రం చేసుకోవచ్చు. వాటిని గుడ్డ కంటే స్పాంజ్‌తో మరింత శుభ్రంగా క్లీన్ చేయవచ్చు.
పెడిక్యూర్‌గా: స్పాంజ్ మీ పాదాల మీద రుద్ది శుభ్రం చేసుకోవచ్చు. స్పాంజ్ పెడిక్యూర్‌లా చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

No comments:
Post a Comment