దాశరథీ శతకం -- రామదాసు 90
వారిజపత్ర మందిడిన వారి విధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరిపుర్వు రీతి సం
సారమునన్ వెలంగుచు విచారగుడై పరమొందుగాదె స
త్కారమేరింగి మానవుడు ! దాశరథీ కరుణాపయోనిధీ !
భావము :
కరుణా సముద్రా దశరధ నందనా రామా ! తామరాకులో నీరు ఆ తామరాకు నెటుల అంటకుండా ఉండునో, మరియు బురదలో పొరలిన కుమ్మరి పురుగునకు ఆ బురద అంటకుండా ఎటులుండునో . అలానే సంసారమున ఉండి, సంతాపము పొందక తత్వవిచారణ చేయుచు మానవుడు మోక్షమును పొందగలడు. ఎంతచక్కని ఉదాహరణలో సరళంగా సున్నితంగా మనదరికోశం రామదాసు చెప్పుచున్నాడు.
No comments:
Post a Comment