Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Tuesday, 2 September 2014

TOTAL LIST OF GODS ACCORDING INDIAN ANCIENT PURANAS


దేవతలు ఎందరు?
ఎవరిని అడిగినా దేవతలు ఎంతమంది అంటే మూడుకోట్ల మంది అని ఠక్కున చెప్పేస్తారు. వారి ఉత్పత్తి మాత్రం పండితులకు తప్ప సామాన్యులెవ్వరికీ తెలియదంనడంలో అతిశయోక్తి లేదు.దేవతలు రెండు రకాలు. జన్మదేవతలు, కర్మ దేవతలు. అగ్ని, ఇంద్రుడు, యముడు, వాయువు, వరుణుడు మొదలగు వారంతా జన్మ దేవతలు. భూలోకం, ఇతర లోకాల్లో పుణ్య కర్మలు చేసి వాటికనుగుణంగా స్వర్గాది భోగాలను అనుభ వించడానికి వెళ్ళే నహుషుడు మొదలగు వారు కర్మ దేవతలు. మొదటిరకం వారు.. లోక హితానికై సృష్టిం చబడి, ఆయా అధికారాలు చెలాయిస్తూ యజ్ఞ, యాగాదులలో భోక్తల్తె, ప్రళయం వర కు ఉండేవారు, ఇక రెండవ రకం, వారి పుణ్యఫలాలు తరిగిపోగానే, మళ్ళీ వారి కర్మలననుసరించి ఇతర లోకాలకు పోయి జన్మించే వారు. మొదటి తరగతి వారు అష్ట వసువులు, ఏకాదశ రుదల్రు, ద్వాదాశాది త్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం 33 వర్గాలు. 33 కోట్ల దేవతలని కూడా ప్రసిద్ధి.

ఇక్కడ కోటి అంటే సమూహం అనే అర్థమే తీసుకోవాలి గానీ, సంఖ్యతో సంబంధం లేదు. ఇంకా పితృదేవతలు అని మరొక వర్గం ఉంది. వీరు మరణించిన వారి సంత తిచే చేయబడే శ్రాద్ధ కర్మలచే తృప్తి పొంది, మృతులకు వారి బంధువులకు కూడ దుర్గతి నివారణ, సద్గతి ప్రాప్తి కలిగించగల అధికా రాన్ని కలిగి ఉంటారు. మనిషి మరణించడం తోటే, మొదట వెళ్ళేది పితృ లోకానికే. అక్క డే అందరి జన్మల వివరాలు, చేసిన పాప పుణ్యాల జాబితాలు ఉంటాయి. ఆ లోకంలో ఉన్న జాబితాకు కనుగుణంగా, జీవి ఆయా లోకాలకు వెళ్తాడు. తిరిగి కర్మలనాచరించి ఈలోకానికి చేరుతుంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. అన్నారు శంకర భగవత్పాదులు.

ఒక్కొక్క సారి చాలామందికి ఎన్నో సందేహాలు కలుగుతూవుం టాయి. పురాణాల్లో కూడా అనేక సందేహాలు తలెత్తుతాయి. అయితే వాటన్నిటికీ సందేహ నివృత్తి కూడా ఆయా పురాణాల్లోనే ఉంటుంది. అదే పురాణ గ్రంధాల్లోని విశిష్టత. ఇక్కడ దుర్వాసునికి కోపం ఎందుకు పెట్టవలసి వచ్చిందో కూడా ఆయన వృత్తాంతంలోనే ఉంది.

No comments:

Post a Comment

chitika