Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Thursday, 25 September 2014

TELUGU RAMAYAN STORIES - STORY ABOUT URMILA AND HER SLEEP DURING RAMAYAN BATTLE


ఊర్మిళ నిద్ర (లక్ష్మణుడి భార్య ఊర్మిళ) రామాయణం

జనకుడు,కుశద్వజుడు అన్నదమ్ములు . జనకుడు మిధిలకు రాజు. కుశద్వజుడు నాంకశ్య దేశానికి ప్రభువు. జనకునికుమార్తె సీత, కుశధ్వజుడికి ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి అని ముగ్గురు కుమార్తెలున్నారు శివధనుర్భంగం చేసి శ్రీరాముడు సీతను పెళ్ళాడిన సమయంలోనే కుశధ్వజుడు కూడా తన కుమార్తెలు ముగ్గురిని రాముడి తమ్ములగు లక్ష్మణ, భరత, శత్రుఘ్నలకు ఇచ్చి వివాహం జరిపించెను . లక్ష్మణుడి భార్య ఊర్మిళ, భరతుడి భార్య మాండవి, శత్రఘ్నుడి భార్య శ్రుతకీర్తి.

పితృవాక్య పరిపాలనార్దం శ్రీరాముడు సీతను వెంటపెట్టుకుని అరణ్యాలకు పయనమైనప్పుడు అతన్ని విడిచిపెట్టలేక తమ్ముడు లక్ష్మణుడుకూడా వనాలకు బయలుదేరాడు . అప్పుడు ఊర్మిళ తానుకూడా రావడానికి అనుజ్ణ ఇవ్వమని భర్తను వేడుకున్నది. అయితే లక్ష్మణుడు అందుకు అంగీకరించక .

దేవి ! నిద్రాహారాలు లేకుండా పదునాలుగేండ్లు సీతా – రాముల వెంట ఉండి వారికి సేవచేయడానికి వెడుతున్నాను నేను, అయిననూ సూర్య వంశ స్త్రీలు బావగారు నడిచిన త్రోవన నడవరాదు కాబట్టి నీవు అరణ్యాలకు రావడంతగదు అని నచ్చచెప్ప ప్రయత్నం చేయపోవునంతలో .రక్షకబటుడు వచ్చి రాజా! మిమ్ములను రాముల వారు పిలిస్తున్నారు అని చెప్పెను అంత లక్ష్మణుడు ఊర్మిళతొ నీవు ఇచటనే నిలిచి ఉండు అన్నగారి తొ మట్లాడి వచ్చెను అని వెడలెను భర్త ఆజ్ణ శిరసావహించి అయోధ్యలోనే ఉండిపోయింది ఊర్మిళ. వెళ్ళిన వాడు ఎంత సేపటికీ రాక తన భర్త రాకకై ఎదురు చూస్తూ అలానే నిలిచి వున్నది.అంత లక్ష్మణుడు రాముడిని కలిసిన ఆనందంలో ఊర్మిళ విషయాన్ని మరిచి అరణ్యానికి పయనము అయ్యెను .

అక్కడ అడవుల్లో నిద్రాహారాలు లేకుండా, సీతారాములను కంటికి రెప్పలా కనిపెట్టుకుని సేవలు చేస్తూ కఠోరదీక్షలో ఉన్నాడు లక్ష్మణుడు ఇక్కడ ఊర్మిళా దేవి తన భర్త రాకకై తను నడిచి వెళ్ళిన మార్గంలొనె ఎదురు చూస్తూ అలానే నిలబడి వుంది .

అంత అక్కడ కఠోరదీక్షలో ఉన్న లక్ష్మణుడికి ఒకనాడు నిద్రాదేవి ప్రత్యక్షమై, అతనిముందు నిలిచింది . అప్పుడతను “ తల్లీ ! నా యందు దయవుంచి ఈ పదునాలుగేండ్లూ నాచెంతకు రాకు .. నాకు మారుగా అయోధ్యలో ఉన్న నా భార్య ఊర్మిళను ఆవహించు “ అని నిద్రాదేవిని వేడుకున్నాడు.

అంతే మరుక్షణం అక్కడ నిలిచి ఉన్న ఊర్యిళకు నిద్ర ముంచుకొచ్చింది ..ఆ మహాతల్లి ఆ పదునాలుగేండ్లు నిలిచే కళ్లు తెరిచి తన భర్త వెళ్లిన మార్గంలోకి చూస్తూ నిద్ర పోతూ ఉంది. ఆ మహాపతివ్రత ప్రబావం వలన రామ-రావణ యుద్దంలొ లక్ష్మణునికి ఎటువంటి హాని జరగలేదు అని ఒక నానుడి.

సీతా రామలక్ష్మణులు అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత ఆ మహా తల్లిని నిద్రలేపారు. లక్ష్మణుడి ఆనవాళ్ళు చెప్పి అతనిని ఆమెకు చూపించిన తరవాత గాని ఆమె గుర్తించలేకపోయింది.

No comments:

Post a Comment

chitika