Wednesday, 4 May 2016

BLACK BERRY JUICE - NERUDU JUICE GOOD FOR HEALTH


నేరేడు జ్యూస్‌

• కావలసినవి 
నేరేడు పండ్ల రసం - ఒక కప్పు
రాగిపిండి - 1/2 కప్పు
ఖర్జూర పళ్ళు - 6
రోజ్‌ వాటర్‌ - 1 కప్పు
ఫైవ్‌ స్టార్‌ చాక్లేట్‌ - 1

• తయారు చేసే విధానం

ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి పిసికి గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. రాగిపిండిని ఒక కప్పు నీటిలో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో నాలుగు కప్పుల నీరు పోసి మరుగుతుండగా రాగిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ కలుపుతూ రెండు నిమిషాల తరువాత దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఖర్జూర పండ్ల ముక్కలు, ఫైవ్‌ స్టార్‌ చాక్లేట్‌ ముక్కలు, రోజ్‌ వాటర్‌ కలిపి మిక్సీలో వేసి తిప్పి అందులో నేరేడు పండ్ల రసం, రాగిమిశమ్రం వేసి మరోసారి తిప్పి తీసి గాజు గ్లాసుల్లో పోసి ఇవ్వాలి. పిల్లలు చాలా ఇష్టంగా ఈ జ్యూస్‌ తాగుతారు.

HEALTH BENEFITS WITH EATING FRUITS AND TIPS TO TAKE FRUITS REGULARLY


పండ్లు తినే విధానం

చాలామంది పండ్లను ఎపుడు పడితే అపుడు, ఎలా పడితే అలా తినేస్తూ వుంటారు. స్ట్రాబెర్రీలు తినేస్తారు. వెంటనే పెరుగు తింటారు లేదా డిన్నర్ చేస్తారు. లేదా మాంసంతో కలిపి పుచ్చకాయ వంటిది తినేస్తారు. పండ్లను తరచుగా తినటం సరిపోతుందా? లేక అవి తినటానికి ఏదైనా ఒక పద్ధతి వుందా? భోజనం తర్వాత పండ్లు తినవచ్చా? మొదలైన ప్రశ్నలకు పోషకాహార నిపుణులు కొన్ని సూచనలు ఇచ్చారు అవి ఏమిటి? మరి పండ్లు ఎలా తింటే మీకు పూర్తి ఫలితాలనిస్తాయి అనేది పరిశీలించండి.

పండ్లు నేను ఎపుడు తినాలి? పండ్లను తినటానికి మంచి సమయం అంటే, ఉదయం వేళ ఒక గ్లాసు నీరు తాగిన తర్వాత. పండ్లను భోజనం తర్వాత తినటమనేది సరియైనదికాదు. భోజనం తర్వాత వెంటనే తింటే అవి సరిగా జీర్ణం కావు. వాటిలోని పోషకాలు సరిగా జీర్ణవ్యవస్ధ చే పీల్చబడవు.
మీ భోజనానికి ఒక పండు తినటానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్ తో కొన్ని జీర్ణ క్రియ సమస్యలుంటాయి.

నేను పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినవచ్చా? అజీర్ణం లేదా ఎసిడిటీ వంటివి లేకుంటే మీరు పండ్లను పెరుగు తో కలుపుకొని తినవచ్చు. పైన్ ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో మీరిష్టపడితే, తప్పక తినవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలమధ్య తినరాదు.

పండ్లు ఎంత తాజాగా వుండాలి? అరటిపండు మూడు రోజులలోపు, ఆపిల్ ఒక వారంలోపు, రేగిపండు అయిదు లేదా ఆరు రోజులు, బొప్పాయి, పండిన రెండు లేదా మూడు రోజులలోపు, సపోటాలు పండిన రెండు రోజులలోపు తినాలి. ఇతర పండ్లు, చాలావరకు మూడు రోజులవరకు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని తినవచ్చు.