Nishanth's World

Flag Counterhttps://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

chitika

https://www.amazon.in/gp/product/B01LWYDEQ7/ref=as_li_qf_asin_il_tl?ie=UTF8&tag=ramakrishn068-21&creative=24630&linkCode=as2&creativeASIN=B01LWYDEQ7&linkId=ca14743cf3c9ba7f73f108ca8b4c6f2b

My Blog List

chitika

chitika

Wednesday 28 January 2015

LIST OF ANIMALS RESERVE SAFARI TOURISM SPOTS IN ANDHRA PRADESH AND TELANGANA STATES IN INDIA



YOU DONT SEE ME ANY TIME CARTOONS IN TELUGU


ANIMALS WORLD PICS AND IMAGES - PHOTO OF A MOTHER AND BABY MONKEY


NISHANTH INDIAN TRADITIONS AND CULTURES STORIES AND ARTICLES COLLECTION - ABOUT MANGO LEAVES USED AS THORANAM FOR ALL OCCASIONS - WHAT IS THE SCIENTIFIC REASON BEHIND USING MANGO LEAVES IN INDIAN CUSTOMS AND TRADITIONS



పచ్చ తోరణం ప్రయోజనం.

ఇంట్లో పెళ్ళిళ్ళు, వ్రతాలు లాంటి ఏ శుభకార్యం జరిగినా గుమ్మానికి మావిడాకులతో పచ్చ తోరణం కడతాం. దేవాలయాల్లో పండుగలు, ఇతర విశేష దినాల్లో పచ్చ తోరణం కడతారు. తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి నిత్యం కల్యాణం జరిపించి, పచ్చ తోరణం కడతారు కనుక ''నిత్య కల్యాణం పచ్చ తోరణం'' అంటారు.
ఇంతకీ మావిడాకులతో పచ్చ తోరణం కట్టడంవల్ల ఉపయోగం ఏమిటి? అసలు ఎందుకు కడతారు? ఆ వివరాలు తెలుసుకుందాం.
పచ్చని మావిడాకులు మహా సొగసుగా ఉంటాయి. వాటిని తోరణాలుగా వాకిట్లో కట్టడంవల్ల ఇంటికి శోభ వస్తుంది. చూడసొంపుగా, కళాత్మకంగా ఉన్నవి ఏవైనా మానసును ఉల్లాసపరుస్తాయి.
ద్వారాలకు మావిడాకుల తోరణాలు కట్టి, అవి ఎండిపోయినా సరే అలా వదిలేస్తారు. మరో పండుగ లేదా విశేష దినం వచ్చినప్పుడు పాట తోరణాలు తొలగించి, .తాజా మావిడాకులతో మళ్ళీ తోరణాలు కడతారు. ఆకులు వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని, ఆక్సీజన్ను వదుల్తాయి. ఈ సుగుణం మావిడి, మారేడు, వేప ఆకుల్లో మరింత అధికంగా ఉంది. ఈ కారణంగానే పోలేరమ్మ మొదలైన గ్రామదేవతల ఆలయాల్లో వేప మండలు కడతారు. శివార్చనలో మారేడు దళాలను విస్తారంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మూడు రకాల పత్రాల్లో మావిడాకులు ఎక్కువ రోజులు తాజాగా ఉండటంవల్ల, చూట్టానికి మరింత అందంగా ఉండటం వల్ల మావిడాకులతోనే తోరణాలు కడతారు. ఇవి వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. ఆ ప్రదేశంలో స్వచ్చత నెలకొంటుంది.
మావిడాకులు బొగ్గుపులుసు వాయువును పూర్తిగా పీల్చుకుని ప్రాణ వాయువును వదలడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగివున్నాయి. కొన్నిసార్లు ప్రమాదవశాత్తూ తగిలిన దెబ్బలకు రక్తం ఆగకుండా ధార కడుతుంది. అలాంటప్పుడు ఎండిన మావిడాకులను కాల్చి, భస్మం చేసి, ఆ పొడిని గనుక రాస్తే రక్తం కారదు. అంతేకాదు, ఈ చూర్ణాన్ని గాయాలపై వేసి కట్టు కడితే వెంటనే తగ్గిపోతాయి. మావిడాకులు ఇంత గొప్పవి కనుకనే వీటిని గుమ్మానికి కట్టుకునే ఆచారం పుట్టుకొచ్చింది.
కలర్ థెరపీ లేదా రంగుల చికిత్సను అనుసరించి మావిడాకుల్లో ఉండే ఆకుపచ్చ రంగు హాయిని, ఆనందాన్ని ఇస్తుంది. కంటికి మేలు చేస్తుంది.రోజంతా అలసిపోయే కళ్ళు మావిడాకుల తోరణాన్ని చూసినప్పుడు సేద తీరతాయి. కంటికి విశ్రాంతి లభించినట్లవుతుంది.

BADAM CONTAINS VITAMIN-E, COPPER, MEGNESIUM WHICH PROTECTS HUMAN HEART FOR A LONGER PERIOD REDUCES HEART ATTACH RISKS - HEART CARE TIPS WITH BADAM IN TELUGU



COSTLY ITEM KUM KUM PUVVU FACTS AND FIGURES


FACE BOOK UPDATES CARTOONS


AMERICA MARRIAGE IS GOOD FOR ME


KUNG FU PRACTICE


YOU ARE JOKING SIR


TELUGU PURANA STORY OF KARNA IN TELUGU - BRIEF HISTORY IN TELUGU ABOUT BIRTH SECRETS OF MAHARADHI KARNA


కర్ణుడు

 కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.

హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.

FACTS ABOUT EATING AND USING BANANA TWINS


జంట అరటిపళ్ళను తినకూడదా?

.మనం అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న కవల అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం? కవల అరటిపళ్ళు పిల్లలు తినకూడదు.... పెద్దలు తింటే కవల పిల్లలు పుడతారు... కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు.... ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టడం సంగతి అలా వుంచితే, కవల అరటిపళ్ళను దేవతలకు పెట్టకూడదా? ఈ ప్రశ్నకు పండితులు ఇలా సమాధానమిస్తున్నారు.. ‘‘అరటి చెట్టు అంటే మరెవరో కాదు.. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను ఆయన ఇచ్చారు. అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదు. ఎందుకంటే కవల అరటిపండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా.. అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టామంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడం మంచింది’

chitika