Friday, 5 September 2014

Cinnamon Nutrition Facts - DALCHINA CHEKKA USES


వృద్ధాప్యాన్ని దూరం చేసే దాల్చిన చెక్క

వంటకాల్లో వాడే మసాలాల్లో లవంగాలతో పాటు దాల్చిన చెక్క కూడా తప్పనిసరి. చూడడానికి చెట్టుబెరడులాగాకన్పించే దాల్చిన చెక్క వంటకాలకు మంచి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తరచూ వాడుతుంటే వృద్ధాప్యపు ఛాయలు త్వరగా దరి చేరవంటారు ఆయుర్వేద నిపుణులు. దాల్చిన చెక్క శరీరంలోని కణజాలానికి జవసత్వాలను అందిస్తుంది. అందువల్లనే దాల్చిన చెక్కను ప్రతి నిత్యం వాడడం వల్ల ఆ కణజాలాలు నిత్య యవ్వనంగా ఉంటాయట. చక్కెర వ్యాధితో బాధపడే వారు సైతం ఈ దాల్చిన చెక్కను నిత్యం వాడుతూ ఉంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. దాల్చిన చెక్కను పొడి చేసి పాలలో చక్కెరకు బదులు ఈ పొడిని ఓ చెంచా వేసుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు.

No comments:

Post a Comment