Thursday, 7 August 2014

HOW TO REMOVE DANDRUF WITH PUDINA - TIPS IN TELUGU FOR BEAUTIFUL HAIR CARE WITH GREEN LEAVES PUDINA


చుండ్రుకు ఇంటి వైద్యం

పుదీనా ఆకుల్ని మెత్తగా రుబ్బి..కాసిన్ని నీళ్లు కలిపి.. మాడుకు పట్టించి.. గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
గోరువెచ్చటి కొబ్బరినూనెను రాత్రిపూట జుట్టు కుదుళ్లకు మర్దన చేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.

శీకాకాయ పౌడర్‌ను గోరువెచ్చటి నీటిలో కాసేపు నానబెట్టి తలస్నానం చేస్తే బెటర్.

ముదురు వేపాకుల్ని మెత్తగా గ్రైండ్ చేసి.. తలకు పట్టించాలి.

ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. కాస్త గట్టిపడ్డాక షాంపూలా వాడితే బాగుంటుంది.

రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి కొంచెం నీళ్లు జోడించి.. వారానికి రెండుసార్లు వాడితే మొండి చుండ్రును వదిలించుకోవచ్చు.

గుడ్డు తెల్లసొనను జుట్టుకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేయాలి.

No comments:

Post a Comment