Tuesday, 22 July 2014

KAKARAKAYA - BITTERGOURD - HEALTH TIPS IN TELUGU - CANCER PROTECOR


కాకరతో కేన్సర్‌కు అడ్డుకట్ట

భారతీయ వంటకాలలో ఇకపై కాకర కాయకు మరింత ప్రాధాన్యం లభించనుంది! తల, మెడలోని కేన్సర్ కణాల ఎదుగుదలను నిరోధించే లక్షణాలు ఈ కూరగాయలో ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడి కావడమే దీనికి కారణం. జంతువులపై చేసిన ప్రయోగంలో తల, మెడలలో సంభవించే కేన్సర్ కణాల ఎదుగుదలను అణిచి, కణితి పెరగుదలను కాకర తగ్గిస్తుందని కనుగొన్నామని భారతీయ సంతతికి చెందిన పరిశోధకురాలు రత్న రే తెలిపారు. కాకర ప్రభావం కచ్చితంగా ఇంత ఉంటుందని తేల్చి చెప్పలేకున్నా, చికిత్సలో మందులతో పాటు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment