Thursday, 25 September 2014

TELUGU RAMAYAN STORIES - STORY ABOUT URMILA AND HER SLEEP DURING RAMAYAN BATTLE


ఊర్మిళ నిద్ర (లక్ష్మణుడి భార్య ఊర్మిళ) రామాయణం

జనకుడు,కుశద్వజుడు అన్నదమ్ములు . జనకుడు మిధిలకు రాజు. కుశద్వజుడు నాంకశ్య దేశానికి ప్రభువు. జనకునికుమార్తె సీత, కుశధ్వజుడికి ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తి అని ముగ్గురు కుమార్తెలున్నారు శివధనుర్భంగం చేసి శ్రీరాముడు సీతను పెళ్ళాడిన సమయంలోనే కుశధ్వజుడు కూడా తన కుమార్తెలు ముగ్గురిని రాముడి తమ్ములగు లక్ష్మణ, భరత, శత్రుఘ్నలకు ఇచ్చి వివాహం జరిపించెను . లక్ష్మణుడి భార్య ఊర్మిళ, భరతుడి భార్య మాండవి, శత్రఘ్నుడి భార్య శ్రుతకీర్తి.

పితృవాక్య పరిపాలనార్దం శ్రీరాముడు సీతను వెంటపెట్టుకుని అరణ్యాలకు పయనమైనప్పుడు అతన్ని విడిచిపెట్టలేక తమ్ముడు లక్ష్మణుడుకూడా వనాలకు బయలుదేరాడు . అప్పుడు ఊర్మిళ తానుకూడా రావడానికి అనుజ్ణ ఇవ్వమని భర్తను వేడుకున్నది. అయితే లక్ష్మణుడు అందుకు అంగీకరించక .

దేవి ! నిద్రాహారాలు లేకుండా పదునాలుగేండ్లు సీతా – రాముల వెంట ఉండి వారికి సేవచేయడానికి వెడుతున్నాను నేను, అయిననూ సూర్య వంశ స్త్రీలు బావగారు నడిచిన త్రోవన నడవరాదు కాబట్టి నీవు అరణ్యాలకు రావడంతగదు అని నచ్చచెప్ప ప్రయత్నం చేయపోవునంతలో .రక్షకబటుడు వచ్చి రాజా! మిమ్ములను రాముల వారు పిలిస్తున్నారు అని చెప్పెను అంత లక్ష్మణుడు ఊర్మిళతొ నీవు ఇచటనే నిలిచి ఉండు అన్నగారి తొ మట్లాడి వచ్చెను అని వెడలెను భర్త ఆజ్ణ శిరసావహించి అయోధ్యలోనే ఉండిపోయింది ఊర్మిళ. వెళ్ళిన వాడు ఎంత సేపటికీ రాక తన భర్త రాకకై ఎదురు చూస్తూ అలానే నిలిచి వున్నది.అంత లక్ష్మణుడు రాముడిని కలిసిన ఆనందంలో ఊర్మిళ విషయాన్ని మరిచి అరణ్యానికి పయనము అయ్యెను .

అక్కడ అడవుల్లో నిద్రాహారాలు లేకుండా, సీతారాములను కంటికి రెప్పలా కనిపెట్టుకుని సేవలు చేస్తూ కఠోరదీక్షలో ఉన్నాడు లక్ష్మణుడు ఇక్కడ ఊర్మిళా దేవి తన భర్త రాకకై తను నడిచి వెళ్ళిన మార్గంలొనె ఎదురు చూస్తూ అలానే నిలబడి వుంది .

అంత అక్కడ కఠోరదీక్షలో ఉన్న లక్ష్మణుడికి ఒకనాడు నిద్రాదేవి ప్రత్యక్షమై, అతనిముందు నిలిచింది . అప్పుడతను “ తల్లీ ! నా యందు దయవుంచి ఈ పదునాలుగేండ్లూ నాచెంతకు రాకు .. నాకు మారుగా అయోధ్యలో ఉన్న నా భార్య ఊర్మిళను ఆవహించు “ అని నిద్రాదేవిని వేడుకున్నాడు.

అంతే మరుక్షణం అక్కడ నిలిచి ఉన్న ఊర్యిళకు నిద్ర ముంచుకొచ్చింది ..ఆ మహాతల్లి ఆ పదునాలుగేండ్లు నిలిచే కళ్లు తెరిచి తన భర్త వెళ్లిన మార్గంలోకి చూస్తూ నిద్ర పోతూ ఉంది. ఆ మహాపతివ్రత ప్రబావం వలన రామ-రావణ యుద్దంలొ లక్ష్మణునికి ఎటువంటి హాని జరగలేదు అని ఒక నానుడి.

సీతా రామలక్ష్మణులు అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత ఆ మహా తల్లిని నిద్రలేపారు. లక్ష్మణుడి ఆనవాళ్ళు చెప్పి అతనిని ఆమెకు చూపించిన తరవాత గాని ఆమె గుర్తించలేకపోయింది.

LORD HANUMAN MESSAGE TO ALL IN TELUGU


హనుమంతుడి సందేశం

హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీతన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం.

సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీహనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.
హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది థత్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘నీ వెవరివీ అని ఎవరైనా అడిగితే హనుమంటుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేద్రుడి దాసుడినీ. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా….’ మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుందీ అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బౄందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కారు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూల మయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా! ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదూ. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం.

WHAT IS ANNADHANAM - WHAT IS THE SECRET BEHIND THE GREATNESS OF ANNADHANAM


అన్నదానన్నిఎందుకు గొప్పదని భావించబడింది?

ఆకలితో అలమటిస్తున్న వాడికి అన్నం పెట్టడాన్ని అన్నదానమని అంటారు. అత్యోన్నత దానాలలో అన్నదానం ఒకటని పురాణ, ఇతిహాసాలు చాటి చెప్పాయి. భక్తులకు మరియు అతిధులకు బోజనాన్ని పెట్టకుండా చేయు ఏ యజ్ఞమైనప్పటికీ అసం పూర్ణమైనదేనని చెప్పడం జరిగింది. దేవాలయాలలో మరియు ఆశ్రమాలలో అన్నదానం చేయడం ఆనాది ఆచారం. ఇలాటి అన్నదాన కార్యక్రమము ద్వారా భగవంతుడు ఎక్కువగా ప్రసన్నుడౌతానని చెప్పడం జరిగింది.

భారతీయులు “అన్నాన్ని” పరబ్రహ్మంతో పోల్చతూ ‘ అన్నం ప్రబ్రహ్మ స్వరూపం ‘ అని భావించారు. అన్నం కారణంగానే మన జీవన నాటకం భూమి మీద కొనసాగుతోంది. జీవితంలో ఓ వ్యక్తికి ఏది లోపించినా బ్రతకగలడు కానీ అన్నం లోపిస్తే ఎన్ని ఉన్నా బ్రతుక లేడు. కావున అన్నదానం మహోన్నతమైనది. అన్నం లేనివాడికి లేదా తినడానికి ఆ సమయంలో అన్నం లేనివాడికి పెట్టిన అన్నమే అన్నదానమౌతుందని ఇక్కడ గ్రహించాలి. అన్నదానంలో పాల్గోంటే పుణ్యమస్తుందని ఉన్నవాడు కూడా నినడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది సరియైనది గాదు. విందుకు మరియు అనందానానికి ఎంతో తేడా ఉంది.

అన్నదానంలో అన్నాన్ని స్వీకరించిన వారు నేలపైబడిన ఎంగిలి మెతుకులను మరియు అన్నంపెట్టబడిన ఆకును అతడే తీసిపారవేయాలి. కానీ అన్నం పెట్టిన వారితో ఆ పని చేయించరాదు. అలాగే అన్నం పెట్టిన వారు కూడా అన్నం తిన్నవాడి ఎంగిలి మెతుకులకు మరియు అరటి ఆకులు తీసివేయడం సరియైనది కాదు. అలా చేస్తే తిన్నవాడికి హానికరమని చెప్పడం జరిగింది.

దీనికి విరుద్దముగా బంధుమిత్రులకు, సాధు సన్యాసులకు మరియు మహాత్మలకు అన్నం పెట్టినవాడు వారి పాత్రలను, మెతుకులను ఎత్తివేయుట, కంచాలను శుభ్రము చేయుట సరియైనది. అతిథి చేత అంట్లు తోమించారాదు; కేవలం అతిథ్యం మాత్రమే ఇవ్వలి! అలా అతిథి చేత ఎంగిలి మెతుకులు ఏరిస్తే, వారి కంచాలను వారినే కడిగేసుకో – మంటే అది విందు ఇచ్చిన వాడికి హానికరం.

‘ అన్నమో రామ చంద్రా! ‘ అనే వారే మన దేశం – లో ఎక్కువగా ఉన్నరు కాబట్టి, అలాంటి వారికి అన్నాని దానం చేయడంలో వెనుకంజ వేయరాదు. ఒకే రోజు కుప్పలు తెప్పలుగా జనాన్ని పిలిచి అన్నం పెట్టాడమే అన్నదాన మని భ్రమించకండి. మొదట మీ ఇంటి ముందుకు వచ్చిన బిక్షగాళ్ళకు ఒక వ్యక్తి తినేంతటి అన్నాన్ని మరియు శాకాన్ని దానం చేయంది.ఇంక ఎక్కువగా అన్నదానం చేయలనుకుంటే ప్రకటన ఇవ్వవచ్చు.

అలా మనుషులకే కాక కుక్కలకు, కాకులకు, పిల్లలకు, చీమలు, పక్షులకు మొదలగు అనేక ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇవ్వడం ఓక యజ్ఞమే అవుతుంది.

సాధువులకు, భక్తులకు మరియు సాధకులకు విందునిచ్చుట ఎంతో ఫలవంతమైన కార్యమై ఉన్నది.

Monday, 15 September 2014

DASARA FESTIAL SPECIAL ARTICLE - PRAY GODDESS SRI KANAKA DURGA AMMAVARU ON FRIDAY FOR BETTER RESULTS


శుక్రవారం పూట దుర్గమ్మను నిష్ఠతో పూజించండి

శుక్రవారం నాడు దుర్గ నామంతో ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ధర్మానికి, లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే అసుర శక్తుల్ని అంతమొందించిన ఆ శక్తిని శుక్రవారం పూట పూజించే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని, పువ్వులు, ముగ్గులు, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ రోజు సాయంత్రం దుర్గమ్మ తల్లికి నేతితో నింపిన ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగించుకోవాలి. అనంతరం దుర్గమ్మకు అర్చన చేసి, అదే ఆలయంలోని పరమేశ్వరుణ్ణి దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని పురోహితులు అంటున్నారు. తదనంతరం ఆలయంలో పూజను పూర్తి చేసుకుని గృహంలోనూ పంచహారతులతో తమకు వీలైన నైవేద్యాన్ని సమర్పించుకుని దుర్గమ్మను పూజించే వారికి ధనాదాయము, అనుకున్న కార్యములు దిగ్విజయంగా పూర్తి కావడం వంటి శుభ ఫలితాలుంటాయి. అలాగే ఈతిబాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పురోహితులు సూచిస్తున్నారు.

ARTICLE ABOUT LORD SRINIVAS'S BRAHMOTHSAVALU - MEANING - IMPORTANCE - ORIGIN ETC


శ్రీవారిబ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా

పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు. వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి | వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది.

అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది.

నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం. ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి.

అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు. అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ARTICLE ABOUT INFORMATION OF LORD SIVA'S FIVE TEMPLES - PANCHA BHUTHA LINGALU AND ITS HISTORY


పంచభూతలింగాల గురించి మీకు తెలుసా?

పంచభూతలింగాల గురించి మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి. పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం: 

ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:

ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-

ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:

తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:

ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

Thursday, 11 September 2014

ANCIENT INDIAN HISTORICAL STORY ABOUT "PARASURAMUDU"



 పరశురాముడు

పూర్వం కన్యాకుబ్జం అనే నగరాన్ని గాధిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమెను బృగుమహర్షి కొడుకు ఋచీకుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాధిరాజు వద్దకు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు. అందుకు గాధిరాజు "మహాత్మా! ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం తెల్లగా ఉండే వేయి గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతురిని వివాహం చేసుకో " అని అన్నాడు. ఋచీకుడు అలాగేఅని చెప్పాడు. అతడు వరుణిని ప్రాంర్ధించాడు. అప్పుడు గంగా నది నుండి వేయి గుర్రాలు ఋచీకుడు కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగా నదికి అశ్వతీర్ధం అనే పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి ఋచీకుడు గాధి కూతురిని వివాహమాడాడు.
ఒక సారి బృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడలిని దీవించాడు. కోడలిని వరం కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి నాకు ఒక కుమారుడు అలాగే నా తల్లికి ఒక కుమారుని ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు "మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోడి మీ కోరిక నెరవేరుతుంది " అన్నాడు. సత్యవతి, ఆమె తల్లి స్నానం చేసి ఆమె అశ్వత్థవృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున కౌగలించుకున్నారు.
ఆ విషయం తెలిసిన భృగువు కోడలితో " అమ్మా! నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు దారుణమైన క్షాత్రధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు మహా తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని ఔతాడు " అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనుమడికి రావాలని కోరింది. భృగువు అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే కుమారుని కన్నది. ఆ జమదగ్ని ప్రసేన జితుడు అనే రాజు కుమార్తె రేణుకను వివాహమాడాడు. వారికి ఋమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే కుమారులు కలిగారు.
ఒకరోజు జాదగ్ని భార్య రేణుక నీటికోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆసమయంలో చిత్రరధుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. ఆ రాజును చూచి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జ్ఞమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు.అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమద్గ్ని సంతోషించి "నా మాట మన్నించి నందుకు నీకేమి వరం కావాలి ? కోరుకో " అన్నాడు.
రాముడు "తండ్రీ !ముందు నా తల్లిని బ్రతికించండి.తరవాత నా అన్నలను శాపవిముక్తులను చేయండి. నాకు దీర్గాయువు, అమితమైన బలం ప్రసాదించండి. సదా శత్రుజయం ప్రసాదించండి " అని కోరాడు. జమదగ్ని అతనుకోరిన వరాలన్నీ ఇచ్చాడు. ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిధి సత్కారాలు చేసాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకు వెళ్ళాడు. రాముడు ఆసమయంలో ఆశ్రమంలో లేడు.
రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడి పై పగపట్టారు. కానీ అతనిని ఏమి చెయ్యలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంశం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని కృద్ధుడై "అనఘుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధి పూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను " అని ప్రతిజ్ఞ చేసాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరిని సంహరించి ఆ భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగియై మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు.

ARTICLE ABOUT SRIMUKHA LINGAM TEMPLE AT SRIKAKULAM DISTRICT - ANDHRA PRADESH - INDIA



మోక్షకారకం... శ్రీముఖలింగం

దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రల్లో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖ లింగం పుణ్యక్షేత్రం ఒకటి. దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఈ క్షేత్రం శాసనాల్లో లిఖించబడింది. ఎంతో చరిత్ర కలది. మానవ జన్మకి మోక్షం కలగాలంటే శ్రీముఖలింగం దర్శించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అద్భుత నిర్మాణాలు, అపురూప శిల్ప సంపద కలదు.
వంశధార నదీ తీరాన గల శ్రీముఖ లింగంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరనితోపాటు భీమునిచే ప్రతిష్టించబడిన భీమేశ్వర ఆలయం, చంద్రునిచే ప్రతిష్ఠించబడిన సోమేశ్వర ఆలయాలు ఉన్నాయ. దేశంలో ఏ ఆలయాలలో చూసినా శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తాడు. దీనికి భిన్నంగా శ్రీముఖ లింగంలో ముఖాకారంలో దర్శనం ఇవ్వడం గొప్ప విశేషం.
ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏక రాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమైవున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోను, శ్రీముఖ లింగంలోను తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు.
శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తర ముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చుని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖ లింగంలో అష్టగణపతులున్నారు.
వ్యాసమహర్షి భారతముతోపాటు పంచమవేద గ్రంథాలు వ్రాయుటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్టించి ప్రారంభించినట్టు దీనితోపాటు శక్తిగణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి(నాట్య), సిద్ధి గణపతులు దర్శనం ఇస్తారు. ఇక్కడ కోటి లింగాలకు ఒకటి తక్కువ అని చరిత్ర చెబుతుంది.
6, 4, 8వ శతాబ్దాల నాటి ఆలయాలుశ్రీముఖ లింగంలో ఆలయాలు 6,4,8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్టు శాసనాల్లో ఉన్నాయి. ఆరవ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, నాలుగో శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, ఎనిమిదో శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండువందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గజపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటినుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతోంది.
మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికీ మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు.
* స్వప్నేశ్వర లింగం
ఇటీవలి కాలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది. శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
* విప్ప(మధు)చెట్టు
ప్రధాన దేవాలయంలో ముఖాకారంగా దర్శనం ఇస్తుంది. దీనిని మధుకేశ్వర స్వామిగా పిలుస్తారు. శతాబ్దాల క్రితం కీకారణ్యంగా వుండే ఈ ప్రాంతంలో విప్ప (మధు) చెట్టును చిత్రసేనుడు అను కోయరాజు శివుడిని స్మరించి పూజించేవాడు. ఆయనకి చిత్తి, చిక్కల అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. సవతుల పోరు భరించలేక ఒకరోజు చిత్రసేనుడు మధువృక్షమును గొడ్డలితో నరికివేయడంతో అగ్నిజ్వాలలు లేచి అందునుండి శివుడు ముఖ దర్శనం ఇచ్చినట్టు చరిత్ర తెలియజేస్తోంది.
ఇంతటి చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు అలసత్వం చూపుతున్నారని భక్తులనుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
* జాతరలు
మహాశివరాత్రి మూడురోజుల జాతర మహాశివరాత్రి మొదలుకుని నాలుగో రోజు చక్రతీర్ధ స్నానముతో ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినముతోపాటు ప్రతి ఏటా కార్తీక మాసం నాలుగు సోమవారాలు, మిగతా పవిత్ర దినాల్లో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేపడతారు. పర్యాటక ప్రదేశంగా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తించినా కనీస వౌలిక సదుపాయాలు లేకపోవడం శోచనీయం. ఇంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

FACTS ABOUT MAHARANA KHUMBH




కుంభరాణా కీర్తి స్తంభం



రాజస్థాన్‌లోని చిత్తూర్‌గఢ్ కోట 500 అడుగుల ఎత్తున ఒక కొండపై ఉంటుంది. చారిత్రక సంఘటనలకు సాక్షీభూతాలుగా పలు భవనాలు, దేవాలయాలు, గోపురాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో విశిష్టమైన కీర్తిస్తంభం (జయస్తంభం) భారతీయ వాస్తుశాస్త్రానికి అద్వితీయమైన నమూనాగా కనిపిస్తుంది. ఈ గోపురం దాదాపు 120 అడుగుల ఎత్తుకలిగి ఉంటుంది. పునాదుల్లో దాదాపు 30 అడుగుల వ్యాసంతో ఉంటుంది. శిఖరాగ్రంలో గుమ్మటం 17 1/2 అడుగుల ఎత్తు న ఉంటుంది. ఇందులో 157 మెట్ల చుట్టూ ఒక గ్యాలరీని నిర్మించారు. ప్రతి అంతస్తులో ప్రతి ప్రాంగణంలోకి దారిచూపేలా 9 అంతస్తులు వెలుపలి ద్వారాలతో ఉంటాయి. గోపురం పైనుంచి పరిసర ప్రాంతాలను వీక్షించవచ్చు. మాళ్వా, గుజరాత్ రాజులపై తన విజయానికి స్మృతి చిహ్నంగా మేవార్‌కు చెందిన కుంభరాణా ఈ ప్రసిద్ధ గోపురాన్ని నిర్మించాడు.